ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. పట్టణాల్లో 2 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 5 నుంచి 7 నిమిషాల్లోపు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు.
- పట్టణాల్లో రెండు నిమిషాలు..గ్రామీణ ప్రాంతాల్లో ఏడు నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవాలి
- సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
బండ్లగూడ, నవంబర్ 17: పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. పట్టణాల్లో 2 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 5 నుంచి 7 నిమిషాల్లోపు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయంలో జరిగిన పోలీసు అధికారుల సమావేశంలో ఆయన వారికి పలు సూచనలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలు, సమస్యలు.. జాగ్రత్తలపై చర్చించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ స్టేషన్ల వద్ద మరింత బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. రాజేంద్రనగర్ జోన్లోని ఎన్ఫోర్స్మెంట్, కేంద్ర సాయుధ బలగాల వినియోగం.. తదితర అంశాలపై కూడా చర్చించారు.
పోలింగ్ లొకేషన్లు, పోలింగ్ స్టేషన్ ప్రాంతాలలో తీసుకోవాల్సిన అన్ని చర్యలు, మార్గదర్శకాలను ఈ సందర్భంగా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వివరించారు. ఇందులో భాగంగానే బార్డర్ తనిఖీ కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. పోలింగ్ కంటే 72 గంటల ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రత్యేకంగా తెలిపారు. ఎస్ఎఫ్, ఎస్ఎస్ఎఫ్, క్యూఆర్టీ బృందాలు క్లిష్టమైన ప్రాంతాలలో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, చేవెళ్ల ఏసీపీ, పలువురు ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

