నిందితుడు పరార్.. హర్యానాలో అరెస్ట్
నార్సింగి పోలీసుల కస్టడీ నుంచి నాటకీయంగా పరారైన అంతర్రాష్ట్ర గంజాయి కేసు నిందితుడు ముజఫర్‌ను సైబరాబాద్ పోలీసులు హర్యానాలో అరెస్ట్ చేశారు. నిందితుడి ఆచూకీని సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో గుర్తించి ప్రత్యేక బృందాలు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్ తెలిపారు.
- నిర్లక్ష్యంపై అంతర్గత విచారణకు సీపీ ఆదేశం
మణికొండ, జూలై 3: నార్సింగి పోలీసుల కస్టడీ నుంచి నాటకీయంగా పరారైన అంతర్రాష్ట్ర గంజాయి కేసు నిందితుడు ముజఫర్‌ను సైబరాబాద్ పోలీసులు హర్యానాలో అరెస్ట్ చేశారు. నిందితుడి ఆచూకీని సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో గుర్తించి ప్రత్యేక బృందాలు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం గంజాయి అక్రమ రవాణా కేసులో ముజఫర్‌ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు.
ఈ క్రమంలో బాత్రూమ్కు వెళ్లిన నిందితుడు అక్కడి కిటికీ అద్దాలను పగలగొట్టి పోలీసుల కన్నుగప్పి పరారయ్యాడు. దీంతో సీపీ రమేష్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడి కోసం ఇతర రాష్ర్టాల్లోనూ విస్తృతంగా గాలింపు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం, నిఘా సమాచారాన్ని వినియోగించి అతడి కదలికలను నిరంతరం పర్యవేక్షించారు.
ఈ క్రమంలో ముజఫర్ తన భార్యతో కలిసి ఢిల్లీ వైపు పారిపోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ప్రత్యేక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. హర్యానా సరిహద్దుల్లో నిందితుడు, అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు.
ఈ సందర్భంగా సీపీ రమేశ్ మాట్లాడుతూ నిందితుడు ఎంతటి చాకచక్యంగా తప్పించుకున్నా, సాంకేతిక ఆధారాలతో అతడిని హర్యానాలో గుర్తించి అరెస్ట్ చేయగలిగామన్నారు. డ్రగ్స్ ముఠాలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిందితుడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకునేందుకు కారణమైన పరిస్థితులపై కూడా సమగ్ర అంతర్గత విచారణ నిర్వహిస్తామని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

