సిటీబ్యూరో: ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో పాఠశాల యాజమాన్యాలు తమ వంతు సహకారం అందించాలని సైబరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) గజరావు భూపాల్ సూచించారు. శుక్రవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో మాదాపూర్ జోన్ పరిధిలోని పాఠశాలల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా సూల్ ట్రాన్స్ పోర్టేషన్కు సంబంధించిన ట్రాఫిక్ నిర్వహణ, ట్రాఫిక్ సమస్యలపై అవగాహన కల్పించారు.
ఇందులో భాగంగా సాధ్యమైనంత వరకు విద్యార్థులు ప్రైవేటు వాహనాల్లో కాకుండా సూల్ వాహనాలను వినియోగించేలా యాజమాన్యాలు ప్రోత్సహించాలని సూచించారు. దీనిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఒకే మార్గంలో ఎకువ సంఖ్యలో ఒకేసారి సూల్ వాహనాలు వెళ్లకుండా తగిన ఏర్పా ట్లు చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గిస్తే.. సూల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య కొంతమేర తగ్గే అవకాశం ఉంటుందని జాయింట్ సీపీ అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా పాఠశాలల ప్రారంభం, ముగింపు సమయాల్లో కొంత వ్యత్యాసం పాటించడం వల్ల కూడా రోడ్లపై వాహనాల రద్దీని తగ్గించవచ్చన్నారు.
స్కూల్ బస్సు డ్రైవర్లకు నిరంతరం ఆలహాల్ పరీక్షలు నిర్వహించాలని, తద్వారా విద్యార్థులకు సురక్షితమైన ప్రయాణం కల్పించవచ్చన్నారు. పాఠశాల యాజమాన్యం, విద్యార్ధుల తల్లిదండ్రులు, ట్రాఫిక్ పోలీసులు కలిసి సమర్థవంతమైన, సురక్షిత ట్రాఫిక్ నిర్వహణలో భాగస్వామ్యం కావాలని జాయింట్ సీపీ గజరావు భూపాల్ విజ్ఞప్తి చేశారు. మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సీఎస్సీ సీఈవో నావేద్ ఖాన్‌తో పాటు వివిధ పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు పాల్గొన్నాయి.