సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణ, రోజు వారీగా ఎదరయ్యే ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి ప్రతిఒక్కరికీ దైనందిన జీవితంలో శారీరక వ్యాయమం తప్పనిసరిగా ఉండాలని, అందులో పోలీసులకు ఇది మరింత కీలకమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి అన్నారు. సైబరాబాద్ పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్ అండ్ డ్యూటీ మీట్-2025ను మంగళవారం సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కమిషనర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆటల పోటీలు స్నేహాభావాన్ని పెంపొందించడం, ఐక్యతను చాటుతాయని, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొవాలని, ఈ డ్యూటీమీట్ పాల్గొంటున్న వారికి అభినందనలు తెలిపారు, సీనియర్ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవీస్, అన్ని జోన్ల డీసీపీలు పాల్గొన్నారు.