సిటీబ్యూరో, జూన్ 18(నమస్తే తెలంగాణ): నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం అందించడం, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్ అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, పెండింగ్ కేసుల పరిషారం, కోర్టు వ్యవహారాల పురోగతి, ప్రజా భద్రత తదితర అంశాలపై గురువారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో సీపీ డా.రమేష్ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులు, కోర్టు కేసులు, ఈఓడబ్ల్యూ కేసులు, కిడ్నాప్ కేసులు, సైబర్ క్రైమ్ కేసులు, పోక్సో, అత్యాచారం, హత్య కేసు లు మరియు ఇప్పటివరకు ఛేదించని గ్రేవ్ కేసుల దర్యాప్తు పురోగతిని సీపీ సమీక్షించారు.
తీవ్రమైన నేరాల దర్యాప్తులో వేగం పెంచి, నిందితులను త్వరగా గుర్తించి చట్టం ముందు నిలబెట్టేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమర్థంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. మహిళల భద్రత, చిన్నారుల రక్షణకు సంబంధించిన కేసులను అత్యంత ప్రాధాన్యతతో విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జీరో ఎఫ్ ఐఆర్ కేసుల నమోదు, ఇతర పోలీస్ స్టేషన్ల నుంచి బదిలీ అయిన కేసుల పరిషారం, బాధితులకు తక్షణ సేవ లు అందించడం వంటి అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు.
డ్ర గ్స్ నిర్మూలన చర్యలు, కార్మిక శిబిరాల పర్యవేక్షణ, పెండింగ్ నాన్- బెయిలబుల్ వారెంట్ల అమ లు, లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిషారం తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు. ట్రాఫి క్ నిర్వహణకు సంబంధించి ఐటీ కారిడార్, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు చేపడుతున్న చర్యలను సమీక్షించారు. పెండింగ్ కేసుల పరిషారం, మహిళలు , చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యే క దృష్టి సారించాలని ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని సీపీ అధికారులు, సిబ్బందికి సూచించారు.