సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పరిధిలో 14 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్ అవినాష్ మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అల్వాల్, మాదాపూర్, నార్సింగి ఠాణాల ఎస్హెచ్లు వి.ఆనంద్ కిశోర్, ఎన్.తిరుపతి, వి.శివకుమార్లను తమ వాస్తవ జోన్ మల్టీ జోన్-2కు సరెండర్ చేశారు. ఈ ముగ్గురి స్థానాల్లో కొత్త అధికారులను నియమించారు.