సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : వాట్సాప్‌లో అసభ్యకర పోస్టింగ్‌లతో వేధిస్తున్న వ్యక్తిని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమీర్‌పేట్‌కు చెందిన తిరుమల్‌రావు, అతని కుటుంబ సభ్యులకు రవి కుమార్ అనే పేరుతో నగ్న ఫొటోలు పంపిస్తున్నారు. దీనితో తిరుమల్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇన్స్పెక్టర్ గంగాధర్ బృందం దర్యాప్తు జరిపి గుంటూరుకు చెందిన రవికుమార్‌ను గురువారం అరెస్ట్ చేసి నగరానికి తరలించారు. మరో ఘటనలో వృత్తి రీత్యా పూజారి అయిన మల్లిఖార్జున్ డెబిట్ కార్డు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ. 6.5లక్షలు దఫ దఫాలుగా కొట్టేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరుపగా, గుంటూరుకు చెందిన దుర్గాప్రసాద్ పేటీఎం ఖాతాలోకి డబ్బు మళ్లించినట్లు గుర్తించారు. దుర్గాప్రసాద్‌ను గుంటూరులో అరెస్టు చేసి గురువారం నగరానికి తీసుకువచ్చారు. నిందితుడు బాధితుడి తమ్ముడి కొడుకే కావడం గమనార్హం.