శ్రేయాస్ మీడియాస్ ఆధ్వర్యంలో దుబాయి వేదికగా నిర్వహించనున్న మిస్ హైనెస్-2023 అందాల పోటీలకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం మంగళవారం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని ఎఫ్-హౌజ్లో నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో మోడల్స్ అదరగొట్టారు.
పలు నగరాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొన్నారని, దుబాయిలో గ్రాండ్ ఫినాలే మార్చిలో నిర్వహిస్తారని శ్రేయాస్ మీడియాస్ అధినేత శ్రీనివాస్ తెలిపారు.
– బంజారాహిల్స్,ఫిబ్రవరి 14