Amberpet | అంబర్‌పేట, మార్చి18 : ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని కారణంగా అంబర్‌పేటలోని క్రౌన్ ఫంక్షన్‌హాల్‌ను అంబర్‌పేట సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. డీసీ మారుతీ దివాకర్, ఏఎంసీ బి.రవీందర్, పి.రవీందర్‌ల ఆధ్వర్యంలో సిబ్బంది గేటుకు తాళం వేశారు. ఒక ప్రాపర్టీకి సంబంధించి రూ.6.11 లక్షలు, మరో ప్రాపర్టీకి సంబంధించి రూ.10.48 లక్షలు ఆస్తిపన్ను బకాయి ఉంది. పన్ను చెల్లించాలని నోటీసులు ఇచ్చిన పట్టించుకోకపోవడంతో మంగళవారం ఫంక్షన్‌హాల్‌ను సీజ్ చేశారు.