షబ్బీర్ అలీ అల్లుడు, మాజీ సీపీ ఏకే ఖాన్ కొడుకుపై క్రిమినల్ కేసు
కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ అల్లుడు, హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ కొడుకుపై క్రిమినల్ కేసు నమోదైంది. పెట్టుబడుల పేరిట రూ.50లక్షలు మోసం చేశాడని సినీ నిర్మాత వెంకట అనీశ్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ అల్లుడు, హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ కొడుకుపై క్రిమినల్ కేసు నమోదైంది. పెట్టుబడుల పేరిట రూ.50లక్షలు మోసం చేశాడని సినీ నిర్మాత వెంకట అనీశ్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని మణికొండ ప్రాంతానికి చెందిన సినీ నిర్మాత వెంకట అనీశ్ రెడ్డి ప్రస్తుతం మహారాగ్ని అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం అతను ఫైనాన్షియర్ల కోసం వెతుకుతున్న సమయంలో షబ్బీర్ అలీ అల్లుడు మోసిన్ ఖాన్, తబ్రేజ్ పరిచయమయ్యారు. జూబ్లీహిల్స్ సన్లైట్ కార్యాలయంలో పరిచయమైన వారు.. పెట్టుబడులను సమకూరుస్తామని నమ్మించారు. ఫైనాన్స్ ఇప్పించాలంటే తమకు కమిషన్ రూపంలో ముందుగానే రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే వారిని నమ్మిన అనీశ్ రెడ్డి.. అడిగినంత డబ్బును ముందుగానే ఇచ్చేశాడు.
అయితే డబ్బులు తీసుకుని రోజులు గడుస్తున్నప్పటికీ మోసిన్ ఖాన్, తబ్రేజ్ల నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో జూబ్లీహిల్స్ సన్లైట్ కార్యాలయానికి వెళ్లి డబ్బులు తిరిగి ఇవ్వాలని అనీశ్ పట్టుబట్టాడు. అయితే డబ్బులు ఇవ్వకుండా బౌన్సర్లతో దాడి చేయించి అక్కడి నుంచి పంపించారు. ఈ క్రమంలో అనీశ్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. అనీష్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
హరీశ్రావు మామకు హైకోర్టులో ఊరట.. హనుమంతరావు భూమి స్వాధీనంపై చర్యలొద్దని ఆదేశాలు
Indiramma Illu | ఆశలు కూల్చిన ‘ఇందిరమ్మ’!.. పాత ఇల్లు కూల్చేయడంతో నిలువనీడ లేక.. ఖాళీ స్థలంలోనే తల్లి అంత్యక్రియలు!
Thummala Nageshwara Rao | యాసంగిలో వరి వేయొద్దు.. రైతులకు తుమ్మల నాగేశ్వరరావు సూచన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

