హైదరాబాద్: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో (Saroor Nagar) దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. సరూర్ నగర్ చెరువులో దుర్గమ్మను నిమజ్జనం చేస్తుండగా భారీ క్రేన్ అమాంతం గాల్లోకి లేచి పల్టీ కొట్టింది. అయితే ఆది చెరువులో పడిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అదే రోడ్డు వైపు పడితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండేది.
అనువభం లేని కంపెనీకి నిమజ్జనం బాధ్యతలు అప్పజప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. 43 శాతం తక్కువ మొత్తానికి కోట్ చేయడంతో సిటీ క్రేన్ సర్వీసెస్‌కు నిజమజ్జనం టెండర్‌ను జీహెచ్ఎంసీ కేటాయించింది. అయితే అనుభవంతోపాటు మెయింటేనెన్స్ కూడా సరిగా లేకపోవడంతోనే ఈ ఘటన జరిందని బెబుతున్నారు. గత వినాయక నిమజ్జనంలో ట్యాంక్‌బండ్‌పై కూడా ఇదే కంపెనీకి చెందిన క్రేన్‌కు ప్రమాదం జరిగింది. అయినప్పటికీ అదే కంపెనీకి వివిధ చోట్ల కాంట్రాక్టులు అప్పగించడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నారు.