సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): సెలబ్రిటీ క్రికెట్ లీగ్-2025 టీ20 మ్యాచ్‌లకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. పదకొండో సీజన్ సెలబ్రిటీ క్రికెట్ పోటీలు ఈ నెల 14, 15వ తేదీల్లో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగనున్నాయి.
ఈ నేపథ్యంలో బుధవారం పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు క్రికెట్ మ్యాచ్ నిర్వాహకులు, ఆయా ప్రభుత్వ విభాగాలతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మ్యాచ్ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ఆట చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.