హైదరాబాద్ : హబీబ్ నగర్(Habib Nagar )లో యువతి మిస్సింగ్ విషయంలో కేసు నమోదు చేయని పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి(CP Srinivas Reddy) తెలిపారు. ఈ నెల 8వ తేదీన హబీబ్ నగర్లో యువతి మిస్సింగ్(Missing case) అవగా పదో తేదీన యువతి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా పోలీసులు ఈ రోజు వరకు కేసు నమోదు చేయలేదు. దీంతో శుక్రవారం సీపీ స్వయంగా హబీబీనగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు వివరాలను పరిశీలించారు. పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకుండా చూస్తామని హామీనిచ్చారు. కాగా, మొయినాబాద్లో చనిపోయిన యువతి హబీబ్ నగర్ చెందిన యువతీగా గుర్తించారు.