దేశంలోనే ఆదర్శంగా సైబరాబాద్ పోలీస్
కేసులను ఛేదించడం, పోలీసింగ్, తదితర అంశాలను సాంకేతిక పరిజ్ఞానంతో సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్, సైబర్ నేరాల దర్యాప్తు, ట్రాఫిక్ నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్, పబ్లిక్ -ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా సమర్థవంతమైన పోలీసింగ్‌ను నిర్వహించడంలో సైబరాబాద్ పోలీసులు దేశంలోనే ఆదర్శంగా నిలిచారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ డాక్టర్ రమేశ్ అన్నారు.
- కమిషనరేట్ ఆవిర్భావ దినోత్సవంలో సీపీ డాక్టర్ రమేశ్
సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): కేసులను ఛేదించడం, పోలీసింగ్, తదితర అంశాలను సాంకేతిక పరిజ్ఞానంతో సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్, సైబర్ నేరాల దర్యాప్తు, ట్రాఫిక్ నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్, పబ్లిక్ -ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా సమర్థవంతమైన పోలీసింగ్‌ను నిర్వహించడంలో సైబరాబాద్ పోలీసులు దేశంలోనే ఆదర్శంగా నిలిచారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ డాక్టర్ రమేశ్ అన్నారు.
కమిషనరేట్ 24వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో సీపీ డాక్టర్ రమేశ్ జాతీయ పతాకాన్ని ఆవిషరించా రు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీపీ మాట్లాడుతూ…సైబరాబాద్ పోలీసుల వృత్తి నైపుణ్యాలకు జాతీయ స్థాయి పురసారాలు లభించాయన్నారు. సైబరాబాద్ ప్రాంతం దేశ జీడీపీకి గణనీయంగా తోడ్పడుతున్నదని, ఐటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఫార్మా, బయోటెక్నాలజీ, ఎంఎస్ ఎంఈలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగాల వృద్ధికి పోలీసులు కల్పించే భద్రతనే పునాది అని సీపీ వివరించారు. అనంతరం కమిషనరేట్ ప్రాంగణంలో మొకను నాటిన తరువాత సీపీ.. ధీర, వీర, ధృవ, భీమ, రాఖీ, తేజ, మౌని, లైకా పోలీసు జాగిలాల గౌరవ వం దనం స్వీకరించారు.
ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సీపీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పోలీసు సిబ్బంది స్వచ్ఛం దంగా రక్తదానం చేశారు. ఫార్మేషన్ డే సందర్భంగా నార్సింగి సైకిల్ ట్రాక్ పై ప్రజలతో కలిసి పోలీసులు ప్రజలతో కలిసి సైక్లింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్, శేరిలింగంపల్లి డీసీపీ సి. హెచ్. శ్రీనివాస్, అడ్మిన్ డీసీపీ టి. అన్నపూర్ణ, డీసీపీ క్రైమ్స్ ముత్యం రెడ్డి, డీసీపీ స్పెషల్ బ్రాంచ్ వై.వి.ఎస్. సుధీంద్ర, సైబర్ క్రైమ్స్ డీసీపీ సాయి మనోహర్, ఎస్ఓటీ డీసీపీ శోభన్ కుమార్, ట్రాఫిక్-1 డీసీపీ రంజన్ రతన్ కుమార్, సీఏఆర్ హెడ్ క్వార్టర్ డీసీపీ సంజీవ్, ఇతర ఏడీసీపీలు, ఏసీపీలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

