Manne Krishank | బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ రిమాండ్‌ను నాంపపల్లి కోర్టు తిరస్కరించింది. సుప్రీమ్ కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రిమాండ్‌ను రిజెక్ట్ చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. బార్ కౌన్సిల్ సభ్యుడు, సీనియర్ న్యాయవాది గన్నమనేని కిరణ్ కుమార్ మన్నె క్రిశాంక్ తరపున బలమైన వాదన వినిపించారు. కాగా, బీఆర్ఎస్ నేత, మాజీ కార్పొరేషన్ చైర్మన్, ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై మరో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకే క్రిశాంక్ నివాసం వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
క్రిశాంక్ ఇంటి తలుపులు బలవంతంగా తెరిచి లోపలికి ప్రవేశించేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసుల రాకతో విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం క్రిశాంక్ నివాసానికి చేరుకుంది. పార్టీ కార్యకర్తలు సైతం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటుండటంతో పరిస్థితి రాజకీయంగా వేడెక్కింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ హోదాలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న క్రిశాంక్‌పై సోషల్ మీడియా పోస్టుల విషయంలో గతంలోనూ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో కేసు నమోదు చేయడం ద్వారా ప్రతిపక్ష నాయకుల గొంతును అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సోషల్ మీడియా పోస్టులపై కేసులు నమోదు చేస్తూ పార్టీ నేతలను పదేపదే పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని విమర్శిస్తోంది.
బ్రేకింగ్ న్యూస్
మన్నె క్రిశాంక్ రిమాండ్ రిజెక్ట్ చేసిన నాంపల్లి కోర్టు https://t.co/Z2Br8Saojh
— Telugu Scribe (@TeluguScribe) September 18, 2026