హైదరాబాద్: కంట్రీ చికెన్ కో హైదరాబాద్‌లో మొట్టమొదటి కంట్రీ చికెన్ కో నూతన బ్రాంచ్ ను ప్రారంభించింది. ఇప్పటివరకూ ఆన్లైన్లో మాత్రమే విక్రయిస్తున్న కంట్రీ చికెన్ కో బ్రాండ్ హైదరాబాద్ లోని ప్రగతి నగర్లో ఆఫ్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే వివేకానంద్ లు ముఖ్యఅతిధిగా హాజరై నూతన స్టార్ ను లాంఛనంగా ప్రారంభించారు.
ఈసందర్భంగా కంట్రీ చికెన్ కో సీఈఓ సాయికేష్ మాట్లాడుతూ నాటుకోడి లో ఉండే అన్నిరకాల దేశీయ కోళ్లు తమ వద్ద ఉన్నాయన్నారు. తెలంగాణ, ఆంధ్రలో లభించే నాటుకోళ్లు, కడక్‌నాథ్, మైసూర్ క్వీన్ వంటి రకాలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.