HomeHyderabadCounterfeit D Calcium Tablets On The Market
మార్కెట్లోకి నకిలీ డీ-కాల్షియం మాత్రలు
చైనాకు చెందిన గ్జిన్ఫా ఫార్మస్యూటికల్ కంపెనీ పేరుతో రాష్ట్రంలోని మార్కెట్లో నకిలీ డీ-కాల్షియం పాంటొతెనేట్ మాత్రలు చెలామణి అవుతున్నాయని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): చైనాకు చెందిన గ్జిన్ఫా ఫార్మస్యూటికల్ కంపెనీ పేరుతో రాష్ట్రంలోని మార్కెట్లో నకిలీ డీ-కాల్షియం పాంటొతెనేట్ మాత్రలు చెలామణి అవుతున్నాయని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.
వాస్తవానికి గ్జిన్ఫా ఫార్మస్యూటికల్ కంపెనీ పేరుతో ఎలాంటి డ్రగ్ తయారు కాలేదని, అసాంఘిక శక్తులు సదరు కంపెనీ పేరుతో నకిలీ ఔషధాలను తయారు చేసి ప్రజల ప్రాణాలకు హాని కలిగించే విధంగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు గ్జిన్ఫా ఫార్మ కంపెనీ పేరుతో మార్కెట్లో చలామణి అవుతున్న డీ-కాల్షియం ఔషధాలను వినియోగించవద్దని, వీటి అమ్మకాలను సైతం వెంటనే నిలిపివేయాలని అన్ని ఫార్మా ఏజెన్సీలు, షాపులను ఆదేశించారు.