బంజారాహిల్స్ : బోనాల పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్ డివిజన్లోని పలు బస్తీల్లో అమ్మవారి ఆలయాల వద్ద లైటింగ్ ఏర్పాట్లను వేగవంతం చేయాలని కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతిని కోరారు. బుధవారం జోనల్ కమిషనర్‌ను కలిసిన విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ మాట్లాడుతూ.. ఫిలింనగర్ 18 బస్తీలతోపాటు డివిజన్ పరిధిలోని ఇతర బస్తీల్లో బోనాల వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయన్నారు. అమ్మవారి ఆలయాల వద్ద అరకొరగా లైటింగ్ ఏర్పాట్లు చేస్తే ఇబ్బందులు తప్పవని, పూర్తిస్థాయిలో లైటింగ్ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆలయాల వద్ద పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూడాలని సూచించారు.