ఇటు భద్రత.. అటు చైతన్యం
వారిద్దరూ కానిస్టేబుళ్లు. భద్రత, బందోబస్తు సమయాల్లో తుపాకీతో విధులు నిర్వహిస్తారు. ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఒకరు కలం పట్టారు. మరొకరు గళం విప్పారు. వీరి ప్రావీణ్యాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు సైబరాబాద్ కళాబృందంలో చోటు కల్పించారు
ఒకరిది కలం.. మరొకరిది గళం..
పోలీసు కళాబృందాల్లో రాణిస్తున్న కానిస్టేబుళ్లు
ప్రజా చైతన్య కార్యక్రమాల్లో ప్రత్యేక ప్రతిభ
ఉన్నతాధికారుల ప్రశంసలు.. ప్రజల అభినందనలు
సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): వారిద్దరూ కానిస్టేబుళ్లు. భద్రత, బందోబస్తు సమయాల్లో తుపాకీతో విధులు నిర్వహిస్తారు. ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఒకరు కలం పట్టారు. మరొకరు గళం విప్పారు. వీరి ప్రావీణ్యాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు సైబరాబాద్ కళాబృందంలో చోటు కల్పించారు. ఇప్పటి వరకు దాదాపు 350 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటు పోలీసు విధులు, అటు ప్రజా అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఈ కానిస్టేబుళ్లకు సైబరాబాద్ కళా బృందంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.
వాడుక భాషలో 40 పాటలు..
వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలానికి చెందిన బొల్ల శ్రీనివాస్ బీఎస్సీ కెమిస్ట్రీ చదివాడు. ఆ తర్వాత పోలీసు ఉద్యోగంలో చేరి ప్రస్తుతం సైబరాబాద్ కార్ హెడ్ క్వార్టర్స్‌లో ఆర్డ్ రిజర్వ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. 6వ తరగతి నుంచి స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా, పాఠశాలలో ఉపాధ్యాయుల వీడ్కోలు కార్యక్రమాల్లో వాడుక భాషలో పాటలు రాసేవాడు. దీనిని గుర్తించిన మాస్టర్ కృష్ణయ్య మరింత ప్రోత్సహించడంతో పాటలు రాయడంలో రాటుదేలాడు. పోలీసు ఉద్యోగంలో చేరిన తర్వాత పోలీసు సేవలపై పాట రాసి తోటి ఉద్యోగులను ఆకట్టుకున్నాడు. సైబరాబాద్ కళాబృందం గురించి తెలుసుకుని అందులో చేరి ఆన్లైన్ మోసాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, మహిళలపై అఘాయిత్యాలు, ఈవ్‌టీజింగ్, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, మూఢనమ్మకాలు వంటిపై వాడుక భాషలో 40 పాటలు రాశాడు. వాడుక భాషలో పాటలు ఉండడంతో ఉన్నతాధికారులు, ప్రజలను అమితంగా ఆకట్టుకున్నాయి.

తన గళంతో ప్రజల్లోకి..
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పర్వేడ గ్రామానికి చెందిన వెంకటేశ్ ఎం.ఏ తెలుగు లిటరేచర్ చదివాడు. ఆ తర్వాత పోలీసు ఉద్యోగం సాధించి ప్రస్తుతం సైబరాబాద్ కార్ హెడ్ క్వార్టర్స్‌లో ఆర్డ్ రిజర్వు కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి సినిమా పాటలు పాడే వెంకటేశ్ కొన్ని సందర్భంలో ఆ సినిమా పాటల మ్యూజిక్కు మాటలు మార్చి పాడడం మొదలు పెట్టాడు. అలా ఆకర్షణీయంగా పాటలు పాడుతున్న వెంకటేశ్‌కు సైబరాబాద్ కళా బృందంలో అవకాశం కల్పించారు. ఎన్నో కార్యక్రమాల్లో తన పాటలతో ప్రజల్లో చైతన్యం కలిగించడానికి కృషి చేస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటున్నాడు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Gold price | బంగారం మళ్లీ ఆల్‌టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

