హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో నిర్మాణంలో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భారీ చోరీ జరిగింది. అక్కడున్న 38 కాపర్ బండిల్స్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీంతో ప్రాజెక్టు మేనేజర్ సురేశ్ కృష్ణ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీ ఘటనపై నిర్మాణ సంస్థ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించనున్నారు.