Yogita Rana | తెలంగాణలో కోర్టు ఆదేశాలను లెక్క చేయని ఐఏఎస్ అధికారులు సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నది. కోర్టులు ఎన్నిసార్లు మందలించినా వారి తీరు మారడం లేదు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ నిధుల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని గతంలో దుర్గం రవీందర్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. ఈ అంశంపై విచారణ చేపట్టి, మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని గతేడాది అక్టోబర్ నెలలో తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏడాది గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో దుర్గం రవీందర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని యోగితా రాణాకు హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
కోర్టు ఆదేశాలను లెక్క చేయని ఐఏఎస్ అధికారులు
తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు కోర్టు ధిక్కరణ నోటీసు
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ నిధుల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని గతంలో హైకోర్టులో పిల్ దాఖలు చేసిన దుర్గం… pic.twitter.com/LGBEFb8laP
— Telugu Scribe (@TeluguScribe) September 3, 2026