నాసిరకం కూలర్ అమ్మినందుకు.. జరిమానా
నాసిరకం కూలర్ అమ్మినందుకు క్రోమా, సింపొనీలకు వినియోగదారుల కమిషన్ మొట్టికాయలు వేసింది. వినియోగదారుడికి రూ.5వేల నష్టపరిహారంతో పాటు రూ. రెండు వేలు ఖర్చుల కింది అందజేయాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు కె.రామ్మోహన్‌తో కూడిన బెంచ్ ఆదేశించింది
సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): నాసిరకం కూలర్ అమ్మినందుకు క్రోమా, సింపొనీలకు వినియోగదారుల కమిషన్ మొట్టికాయలు వేసింది. వినియోగదారుడికి రూ.5వేల నష్టపరిహారంతో పాటు రూ. రెండు వేలు ఖర్చుల కింది అందజేయాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు కె.రామ్మోహన్‌తో కూడిన బెంచ్ ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. న్యూబోయిన్‌పల్లికి చెందిన ఎస్వీఎస్ఎస్ రామచంద్ర సికింద్రాబాద్ క్రోమా కంపెనీ నుంచి సింపొని ఎయిర్ కూలర్‌ను మార్చి 2021లో రూ.14,650కి కొనుగోలు చేశాడు.
వారంటీ కార్డుతో పాటు సాధారణ కిట్‌ను వినియోగదారుడికి అందజేయలేదు. అయితే, కూలర్ సరైన విధంగా కూల్ కాకపోవడం, ఎక్కువగా శబ్దం రావడం, టైమర్ బటన్ కూడా పనిచేయకపోడంతో వినియోగదారుడు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. సంబంధిత టెక్నీషియన్ వచ్చి మరమ్మతు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో, వినియోగదారుడు క్రోమా షోరూంతో పాటు తయారు కంపెనీపై వినియోగదారుల కమిషన్-1లో కేసు వేశారు. పూర్వపరాలను పరిశీలించిన కమిషన్ బాధితుడికి నష్టపరిహారం కింద రూ.5వేలతో పాటు ఖర్చుల కింద మరో రెండు వేలు చెల్లించాలని బెంచ్ ఆదేశించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

