GHMC | సిటీబ్యూరో: గ్రేటర్లో భవన నిర్మాణ వ్యర్థాల తరలింపు ప్రక్రియ గాడితప్పంది. ఎక్కడ పడితే అక్కడే నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. నిర్మాణ వ్యర్థాల సేకరణకు టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు. జీడిమెట్ల, ఫతుల్లాగూడ, మలాజిగిరి, శంషాబాద్, తూంకుంటల్లో సీ అండ్ డీ రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.
అయితే ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమి కారణంగా భవన నిర్మాణ, కూల్చి వేసిన వ్యర్థాలను రోడ్డు, పుట్‌పాత్, నాలాలు, చెరువులు, అనుమతి లేని ప్రదేశాల్లో పడేస్తున్నారు. భవన నిర్మాణ వ్యర్థాలను సీ అండ్ డీ ప్లాంట్లకు తరలించాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగేలా అనుమతి లేని ప్రదేశాల్లో పారబోస్తే.. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించినా.. ఫలితం లేకుండాపోతున్నది.
జోనల్ పరిధిలో సర్కిళ్ల వారీగా నిర్మాణ వ్యర్థాల కలెక్షన్ పాయింట్లు, మినీ వాహనాలు, ట్రాక్టర్ల ద్వారా తరలించే వ్యవస్థ కనబడటం లేదు. ఫలితంగా భవన నిర్మాణ వ్యర్థాలతో గ్రేటర్‌లోని ప్రధాన రహదారులు డంపింగ్ యార్డులకు నిలయాలుగా మారుతున్నాయి. ‘స్వచ్ఛ హైదరాబాద్’ లక్ష్యం నీరుగారుతున్నది.
టోల్‌ఫ్రీ నంబర్లు ఇచ్చినా.. సజావుగా సాగట్లే
మెహిదీపట్నం, కార్వాన్, గోషామహల్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ సరిల్తో పాటు, చార్మినార్ జోన్‌లోని చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, చార్మినార్, రాజేంద్రనగర్ సరిల్, కూకట్పల్లి, అల్వాల్, సికింద్రాబాద్ జోన్లో మలాజిగిరి, ముషీరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట సరిల్ పరిధిలో నిర్మాణ వ్యర్థాలు సేకరణకు తూంకుంట, శంషాబాద్ ప్లాంట్ సంబంధించి వాట్సాప్ నంబర్ 73300 00203, లేదా టోల్ ఫ్రీ 1800-203-0033కు ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి వ్యర్థాలను తీసుకొని వెళ్తారని కమిషనర్ తెలిపారు.
మూసాపేట్, కూకట్పల్లి, గాజులరామారం, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి జోన్ యూసుఫ్‌గూడ, చందానగర్ శేరిలింగంపల్లి, ఆర్సీపురం సర్కిళ్లకు, సికింద్రాబాద్ జోన్ అంబర్‌పేట, ఎల్బీనగర్ జోన్లో ఉప్పల్, హయత్ నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్, చార్మినార్ జోన్లో మలక్‌పేట, సంతోష్‌నగర్ సరిళ్లలో ఫతుల్లగూడ, జీడిమెట్ల ప్లాంట్లకు సంబంధించిన వాట్సాప్ నంబర్ 9100 927 073కు లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800- 120 – 1159కు కాల్ చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు టన్నుకు జీహెచ్ఎంసీ నిర్ణయించిన రుసుం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం భవన నిర్మాణ వ్యర్థాల తరలింపు సజావుగా సాగడం లేదు.
చెత్త ఎత్తేవారేరీ..?
వారసిగూడలోని రహదారి వెంట వ్యర్థాలు ఇలా పడేయడంతో అటుగా వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. నగరాన్ని స్వచ్ఛతగా మారుద్దామంటూ..పిలుపునిచ్చే బల్దియా నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నారు