నకిలీ పత్రాలు సృష్టించి భవన నిర్మాణం
నకిలీ పత్రాలు సృష్టించి నిర్మిస్తున్న ఆరంతస్తుల భవన నిర్మాణాన్ని శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. కొండాపూర్ డివిజన్ పరిధి రాజరాజేశ్వరి నగర్ కాలనీలోని 147 ప్లాట్ నంబర్లో ఉన్న 300 గజాల స్థలం నానిశెట్టి ప్రమీల పేరుతో ఉంది.
- సీజ్ చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు
కొండాపూర్, మే 24 : నకిలీ పత్రాలు సృష్టించి నిర్మిస్తున్న ఆరంతస్తుల భవన నిర్మాణాన్ని శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. కొండాపూర్ డివిజన్ పరిధి రాజరాజేశ్వరి నగర్ కాలనీలోని 147 ప్లాట్ నంబర్లో ఉన్న 300 గజాల స్థలం నానిశెట్టి ప్రమీల పేరుతో ఉంది. ప్రమీల మరణించడంతో సదరు బిల్డర్ ప్రమీల సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను తయారు చేశారు.
సృష్టించిన పత్రాలతో గోల్కొండ రమేశ్ పేరిట జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో స్టిల్ట్ ప్లస్ 3 భవన నిర్మాణ అనుమతులు తీసుకుని నిర్మాణాన్ని ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న ప్రమీల కుటుంబ సభ్యులు కూకట్పల్లి కోర్టును ఆశ్రయించారు. పరిశీలించిన కోర్టు సదరు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ సదరు బిల్డర్ నిర్మాణ పనులు కొనసాగిస్తుండడంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 20న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారులు, గచ్చిబౌలి పోలీసుల బందోబస్తు మధ్య శనివారం సదరు భవనాన్ని సీజ్ చేశారు. సీజ్ చేసిన వారిలో టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకట రమణ, టీపీఎస్ సంతోష్ కుమార్, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ హబీబుల్లా ఖాన్, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

