మహేశ్వరం, జూన్ 23 : మహేశ్వరం నియోజక వర్గం అభివృద్ధి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితోనే సాధ్యమని ఎంపీపీ రఘుమారెడ్డి, మహేశ్వరం మండల పార్టీ అద్యక్షుడు అంగోతు రాజునాయక్, తుక్కుగూడ మున్సిపాలిటీ అధ్యక్షుడు జల్లెల లక్ష్మయ్య అన్నారు. గురువారం మహేశ్వరం, తుక్కుగూడలో జరిగిన సమావేశంలో మా ట్లాడుతూ.. మహేశ్వరం, తుక్కుగూడ మున్సిపాలిటీలలో స్ట్రీట్ లైట్ల పనుల నిర్మాణానికి రూ. 5కోట్ల 36 లక్షలతో రేపు శంకుస్థాపన చేయనున్నట్లు వారు తెలిపారు. ఒక ప్రణాళికాబద్ధంగా నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పట్టణాలు గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని అన్నారు. మహేశ్వరం నియోజక వర్గానికి రోడ్లు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. స్ట్రీట్ లైట్ల అభివృద్ధికి రావిరాల గాంధీ చౌక్ నుంచి వయా సూర్యగిరి ఎల్లమ్మ దేవాస్థానం, సర్దార్‌నగర్ మీదుగా శ్రీశైలం హైవే వరకు రూ. 1కోటి 2 లక్షలు, ఓఆర్ఆర్ నుంచి మహేశ్వరం కమాన్ వరకు రూ. 1కోటి 8 లక్షలు, మహేశ్వరం గేట్ నుంచి మహేశ్వరం మండల కేంద్రం వరకు రూ. 2 కోట్ల 38 లక్షలు, మహేశ్వరం గేట్ నుంచి మొ హబ్బత్ నగర్ గేట్ వరకు రూ. 50 లక్షలు, రావిరాల గాంధీచౌక్ నుంచి వయా మంకాలమ్మ గుడి నుంచి ఔటర్ రింగు వరకు రూ. 22 లక్షలు, కమాన్ నుంచి ఓ ఆర్ఆర్ వరకు రూ. 16 లక్షలు మంజూరు చేయించారని అన్నారు. ఈ సందర్భంగా మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సునీతానాయక్, సహకార బ్యాంక్ చైర్మన్ మంచెపాండుయాదవ్, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకుడు కూన యాదయ్య, శివగంగ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్‌గౌడ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కల యాదగిరిగౌడ్, మాజీ మండల అధ్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య, మాజీ సర్పంచ్ ఆనందం పీఏసీఎస్ డైరెక్టర్ సత్యం నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, మునగపాటి నవీన్, నర్సింహాగౌడ్, ఆవుల కుమార్, గోపాల్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.