అంబర్‌పేట : ప్రణాళిక బద్దంగా నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ కుమ్మరివాడిలో రూ.50లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను డివిజన్ కార్పొరేటర్ బి.పద్మవెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా రెడ్‌బిల్డింగ్ చౌరస్తా నుంచి కుమ్మరివాడి మీదుగా గాంధీబొమ్మ వరకు గల రోడ్డు అధ్వాన్నంగా మారిందని స్థానికులు తన దృష్టికి తీసుకురావడంతో జనరల్ బడ్జెట్ నుంచి రూ.50లక్షలు మంజూరు చేయించడం జరగిందన్నారు.
ఎన్నో ఏళ్లుగా గత పాలకులు పట్టించుకోక తమ బస్తీకి సరైన రోడ్డు వసతి లేక ఇబ్బందులు పడుతున్నామని, ఈ రోడ్డు నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకున్నందుకు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బస్తీలో పాదయాత్ర నిర్వహించి అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అలాగే బస్తీలో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి రోడ్లను ఊడ్చేటప్పుడు బలంగా మూలల్లో పేరుకుపోయిన చెత్తను కూడా పరిశుభ్రం చేయాలని సూచనలిస్తూ స్వయంగా ఎమ్మెల్యే చెత్తాచెదారాన్ని తొలగించారు.
డ్రైనేజీ పైప్‌లైన్ సమస్య వల్ల మురుగునీరు నిలిచిపోతుందని, అదే విధంగా లోఫ్రెషర్‌తో మంచినీరు వస్తుందని, వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఈఈ శంకర్, డీఈ సుధాకర్, ఏఈ ప్రేరణ, టీఆర్ఎస్ బాగ్‌అంబర్‌పేట డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, పార్టీ నాయకులు శ్రీరాములుముదిరాజ్, అరుణ్‌కుమార్‌రెడ్డి, అఫ్రోజ్పటేల్, కె.మహేష్, కె.నర్సింగ్‌రావు, శివాజీయాదవ్, ఇ.ఎస్.ధనుంజ య, సుధారాణి, స్వర్ణగౌడ్, సంతోష్, యోబు, చంద్రశేఖర్, రవి, శ్రీనివాస్‌యాదవ్, రాజేష్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.