హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బెంగళూరు జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో విజయ్ కుమార్ అనే కానిస్టేబుల్ మృతిచెందారు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన సమీపంలోని దవాఖానకు తరలించారు.
విజయ్ కుమార్ శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారని, గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Constable killed, three injured in road accident on #Bangalore Highway near #Shamshabad
A tragic road #accident occurred on the Bangalore National Highway near Shamshabad when a speeding lorry rammed into a police patrol vehicle conducting routine checks.… pic.twitter.com/eiGt1fALeK
— NewsMeter (@NewsMeter_In) May 24, 2025