Constable | అర్ధరాత్రి కానిస్టేబుల్ వీరంగం.. రెస్టారెంట్ సిబ్బందిపై దాడి.. వీడియో
Constable | రెస్టారెంట్‌ను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచినందుకు ఓ కానిస్టేబుల్ అందులో పని చేస్తున్న సిబ్బందిపై దాడి చేశాడు. ఓ వ్యక్తిని కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్ లాఠీతో దారుణంగా చితకబాదిన దృశ్యాలు సీసీటీవీ పుటేజీలో రికార్డయ్యాయి.
విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఓ రెస్టారెంట్ సిబ్బందిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని టోలిచౌకిలో వెలుగుచూసింది. అర్థరాత్రి విధులు నిర్వరిస్తున్న జ్ఞానేశ్వర్ అనే కానిస్టేబుల్ టోలిచౌకిలో ఉన్న అల్ రికాబ్ మండి రెస్టారెంట్‌ను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచినందుకు అందులో పని చేస్తున్న సిబ్బందిపై దాడి చేశాడు. ఓ వ్యక్తిని కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్ లాఠీతో దారుణంగా చితకబాదిన దృశ్యాలు సీసీటీవీ పుటేజీలో రికార్డయ్యాయి.
టోలిచౌకి పోలీసుల వివరాల ప్రకారం ఈ దాడి ఘటన ఏప్రిల్ 21న జరిగింది. హోటల్ నిర్దేశించిన సమయాని కంటే ఎక్కువ సేపు తెరిచి ఉంచడంపై సిబ్బందిని కానిస్టేబుల్ ప్రశ్నించాడు.. దీంతో ఆ వ్యక్తి కానిస్టేబుల్‌ను దూషించాడు.. అందువల్ల కానిస్టేబుల్ సదరు వ్యక్తిని కొట్టాడు, దాడికి పాల్పడిన కానిస్టేబుల్‌ను మరో ప్రాంతానికి బదిలీ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.
హైదరాబాద్ టోలిచౌకిలో అర్ధరాత్రి ఓ వ్యక్తిని లాఠీతో నిర్దాక్షిణ్యంగా చితకబాదిన జ్ఞానేశ్వర్ అనే కానిస్టేబుల్
అల్ రికాబ్ మండి రెస్టారెంట్‌ను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచినందుకు, అందులో పని చేస్తున్న ఓ సిబ్బందిపై దాడి చేసినట్లు ఆరోపణలు
దాడి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు pic.twitter.com/dRJff4mFsN
— Telugu Scribe (@TeluguScribe) April 23, 2026
Read Also :
Vijayawada Court | కోర్టులో న్యాయవాదులకు తప్పిన ప్రమాదం.. గాలి ఆడక ఇబ్బందులు పడ్డ లాయర్లు
పశువుల కడుపుల్లోకి ప్లాస్టిక్ వ్యర్ధాలు
Viral news | పెళ్లి పీటలపై నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి కొత్త పెళ్లికొడుకు.. Video
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

