కష్టజీవులపై కాంగ్రెస్ కన్నెర్ర చేసింది.. ఫుట్‌పాత్ ఆక్రమణల పేరుతో సీఎంసీ, కూకట్పల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం స్పెషల్ డ్రైవ్ చేపట్టి.. కేపీహెచ్‌బీ కాలనీ టెంపుల్ బస్టాఫ్ చౌరస్తా నుంచి.. కేహెచ్బీకాలనీ హైటెక్‌సిటీ రోడ్డులోని పోచమ్మ దేవాలయం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న సుమారు 100 వరకు చిరు వ్యాపారాలను తొలగించారు. ‘20 ఏండ్లుగా రోడ్లపై జీవనోపాధి పొందుతున్నామని.. తమను అన్యాయంగా రోడ్డున పడేశారు’ అని బాధితులు వాపోయారు. ‘కులవృత్తిని నమ్ముకొని 20 ఏండ్లుగా కుండలమ్ముకొని బతుకుతున్నా. డబ్బాలు తొలగించి.. రోడ్డున పడేశారు. నాకు ఆరోగ్యం బాగలేదు. నడుమునొప్పితో బాధపడుతున్నా.. ఈ డబ్బాతోనే మందులు కొంటున్నా..’ అని బాధితురాలు లక్ష్మి ఆవేదన చెందారు. డబ్బాలు తొలగించడంతో మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించాలి. హౌసింగ్ బోర్డు ఖాళీ స్థలాన్ని చిరు వ్యాపారులకు కేటాయించాలి’..అని రామ్ధన్నాయక్ అన్నారు.
-కేపీహెచ్‌బీకాలనీ, జూన్ 6