హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్వీ నాయకులు(BRSV leaders) డిమాండ్ చేశారు. బుధవారం ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (Congress MLAs) బీర్ల ఐలయ్య , యెన్నం శ్రీనివాస్ రెడ్డిలకు నోటికి హద్దు ఉండడం లేదంటూ ఫినాయిల్‌తో నోటిని శుభ్రం చేసుకోవాలని మెడికల్ కిట్‌ను పంపించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు జి జి రవికిరణ్ ,వేల్పుకొండ రామకృష్ణ, గుమ్మడి క్రాంతి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మానసిక స్థితి సరిగాలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వద్ద కేబినెట్లో చోటు కోసం కవితపై దుర్భాషాలాడడం శోచనీయమని పేర్కొన్నారు.
ఓటుకు నోటు కేసులో ఉన్న వ్యక్తి వద్ద పనిచేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై, మహిళలపై అనుచితంగా మాట్లాడితే ఓయూ విద్యార్థి సంఘాలు సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి జి రవికిరణ్ ,వేల్పుకొండ రామకృష్ణ, గుమ్మడి క్రాంతి,యాదక్రాంతి ,సత్తి రెడ్డి మహర్షి పవన్, కొంపల్లి నరేష్. అవినాష్ నాగేంద్ర జంగయ్య పాల్గొన్నారు.