మల్కాజిగిరి ఏప్రిల్ 10: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయకుండా మోసం చేసిందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. గురువారం బోయిన్ పల్లిలోని క్యాంపు కార్యాలయంలో మల్కాజిగిరి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి చేస్తున్న కృషిని గుర్తించిన వివిధ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని, అందరికీ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు.
మచ్చ బొల్లారంలోని హిందూ శ్మశాన వాటికను రాంకీ సంస్థ ఆక్రమించి చెత్త డంపింగ్ యార్డుగా మార్చడంతో చేసిన ఉద్యమానికి ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి మొహం చాటేసిందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎంబీసీ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్, కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, శరణ్గిరి, పవన్, ప్రశాంత్, రేవంత్ తదితరులు పాల్గొన్నారు.