Kondapur | మహిళపై లైంగిక దాడి, న్యూడ్ వీడియోలతో బ్లాక్మెయిల్.. కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్
: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నాయకుడు కంది జ్ఞానేశ్వర్‌పై లైంగిక దాడి, బెదిరింపులు, బ్లాక్మెయిల్ ఆరోపణలు నమోదవడం సంచలనంగా మారింది.
కొండాపూర్, జూలై 1 : చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నాయకుడు కంది జ్ఞానేశ్వర్‌పై లైంగిక దాడి, బెదిరింపులు, బ్లాక్మెయిల్ ఆరోపణలు నమోదవడం సంచలనంగా మారింది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాధిత మహిళతో పరిచయం పెంచుకున్న కంది జ్ఞానేశ్వర్ ఆమెపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం మహిళకు సంబంధించిన నగ్న వీడియోలు తన వద్ద ఉన్నాయని చెబుతూ, వాటిని బయటపెడతానంటూ బెదిరించి మానసికంగా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
అంతేకాకుండా, వివిధ అవసరాల పేరుతో మహిళ నుంచి డబ్బులు తీసుకుని, తిరిగి ఇవ్వాలని కోరినప్పుడు బెదిరింపులకు దిగినట్లు కూడా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఈ వేధింపులు తట్టుకోలేక ఆమె చందానగర్ పోలీసులను ఆశ్రయించగా, ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేసి నిందితుడు కంది జ్ఞానేశ్వర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. బాధితురాలు చేసిన ఆరోపణలపై ఆధారాలు సేకరిస్తున్నట్లు, కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా, కంది జ్ఞానేశ్వర్ పేరు గతంలో కూడా వివాదాల్లో నిలిచింది. ప్రభుత్వ భూమికి సంబంధించిన కేసు నమోదైంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

