Bandi Sai Bageerath | హైదరాబాద్ :కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై బాలికపై లైంగిక దాడి, ఇతర నేరారోపణల నేపథ్యంలో పేట్ బషీరాబాద్ పీఎస్‌లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ.. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్తోపాటు ప్రజాసంఘాలు, విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.
కాగా పోక్సో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బండి సాయి భగీరథ్ నేటికీ పరారీలోనే ఉన్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇన్ని రోజుల నాటకీయ పరిణామాల అనంతరం కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు బండి సంజయ్ కొడుకు మీద చర్యలకు దిగింది.
బండి సాయి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని బండి సంజయ్ నివాసంలో తనిఖీలు చేపట్టిన సైబరాబాద్ పోలీసులు.. ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్‌లో పోలీస్ బృందాలుగా గాలింపు కొనసాగిస్తున్నారు. అతని కోసం 5 బృందాలు గాలిస్తున్నాయని తెలిపిన పోలీసులు వెల్లడించారు.
బండి భగీరథ్ కోసం వెతుకుతున్న పోలీసులు
హైదరాబాద్‌లోని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ నివాసంలో సైబరాబాద్ పోలీసుల తనిఖీలు https://t.co/BklQkfoPBf pic.twitter.com/664E0DsxMI
— Telugu Scribe (@TeluguScribe) May 16, 2026
బ్రేకింగ్ న్యూస్
ఎట్టకేలకు కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కొడుకు మీద చర్యలకు దిగిన కాంగ్రెస్ ప్రభుత్వం
బండి భగీరథ్ పై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు
హైదరాబాద్‌లోని బండి సంజయ్ నివాసంలో సైబరాబాద్ పోలీసుల తనిఖీలు
ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్‌లో పోలీస్ బృందాల గాలింపు… pic.twitter.com/G96eRPJzG6
— Telugu Scribe (@TeluguScribe) May 16, 2026