భూముల వేలం ఓవైపు.. పారిశ్రామిక భూముల రెగ్యులరైజేషన్ మరోవైపు. నగరం కేంద్రంగా విలువైన భూముల సారాన్ని కాంగ్రెస్ సర్కార్ పీల్చేస్తోంది. ఇచ్చిన హామీలను అమలు చేయలేక, అందుబాటులో ఉన్న భూముల విక్రయాలతోనే ధనార్జన సాధ్యమనుకుంటున్న రేవంత్ సర్కార్ నజర్.. ఇప్పుడు మెట్రో భూములపై పడిందనే చర్చ జోరుగా నడుస్తోంది. ఇప్పటికే నగరంలోని మెట్రో భూములపై అధ్యయనానికి ప్రభుత్వం ఆదేశించగా.. అధికారులు చిట్టా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు, మూడు నెలల్లో మెట్రో భూములను కూడా వేలం వేసే యోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం.
సిటీబ్యూరో, నవంబర్ 26(నమస్తే తెలంగాణ): గ్రేటర్ పరిధిలో 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉన్న మెట్రో సంస్థకు నగరవ్యాప్తంగా 300 ఎకరాలకి పైగా భూమి అందుబాటులో ఉంది. మెట్రోస్టేషన్లు, పార్కింగ్ యార్డులు, డిపోలకు సమీపంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆ సంస్థ ఆధీనంలో విలువైన భూములున్నాయి. అయితే ఆయా భూములను వెనక్కి తీసుకొని రెవెన్యూ సమకూర్చుకునే మంత్రాంగానికి సర్కార్ తెరలేపింది. ఇందులో భాగంగా మెట్రో పరిధిలో ఉన్న భూములను అధ్యయనం చేయడంతో పాటు ప్రాంతాలవారీగా ఆయా భూముల విలువను అధికారులు నమోదు చేస్తున్నారు. ఈ నివేదిక సిద్ధం కాగానే.. తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా మెట్రో భూములను కూడా మార్కెట్లోకి తీసుకువచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం.
పదేళ్ల పాలనలో రాష్ర్టానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం భూముల వేలాన్ని పారదర్శకంగా ఆన్లైన్ ద్వారా నిర్వహించి వేల కోట్లతో కంపెనీలను తీసుకువచ్చింది. వీటితో నగరం పెట్టుబడులకు ప్రధాన వేదికగా నిలిచింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాలకు విస్తృతమైన డిమాండ్ ఏర్పడింది. అప్పుడే భూముల వేలాన్ని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ… అధికారంలోకి రాగానే మాట మార్చివేసి, భూములనే ప్రధాన ఆదాయ వనరులుగా మార్చుకున్నది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే వందలాది ఎకరాలను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
ఈ క్రమంలో హౌజింగ్ భూముల వేలం నుంచి ఇటీవల జరిగిన కోకాపేట, ఇండస్ట్రియల్ భూముల మార్పిడి వరకు రూ.వేల కోట్ల ఆదాయాన్ని కేవలం భూముల నుంచే తీసుకున్నది. ఇదే తరహాలో డిసెంబర్ 5 వరకు జరిగే భూముల వేలం తర్వాత, కొత్త ఏడాదిలో మెట్రో భూములను బేరానికి పెట్టేలా అడుగులు పడుతున్నాయి. నగరంలో రెండు భారీ డిపోలతోపాటు, 57 స్టేషన్లను కలిగి ఉన్న మెట్రో వ్యవస్థ నిర్మాణానికి అప్పట్లోనే రూ.18,880 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో 70శాతం రుణాలతో సర్దుబాటు చేయగా… మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థ భరించింది. అయితే రాష్ట్ర సర్కార్ మిగతా IIవ పేజీలో