బంజారాహిల్స్,నవంబర్ 6: బీఆర్ఎస్ను గెలిపించేందుకే బీజేపీ నేతలు జూబ్లీహిల్స్‌లో డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారంటూ కాంగ్రెస్ మంత్రులతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి ఉప ఎన్నిక ప్రచార సభల్లో, రోడ్‌షోల్లో అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి చెందిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు ప్రధాని మోదీని విమర్శిస్తుండడంతో పాటు బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అంటూ కాంగ్రెస్ మంత్రులు అంటు న్నారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎంఐఎం మద్దతుతో పోటీలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ మాత్రం బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డితో ఆత్మీయ ఆలింగనం చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
బుధవారం ఉదయం ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి ఎదురుపడగా వారిద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రహస్య బంధం బయట పడిందని నెటిజన్లు కామెం ట్స్ చేస్తున్నా రు. బుధవారం రాత్రి యూ సుఫ్‌గూడ డివిజన్లో సీఎం రేవంత్ రోడ్‌షోలో బీజే పీ, బీఆర్ఎస్ ఒక టీమ్ అని. తాను రాహుల్‌గాంధీ, అసదుద్దీన్ ఒవైసీ ఒక టీమ్ అంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు.