జీడిమెట్ల, నవంబర్ 5 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ సమక్షంలో వారు బీఆర్ఎస్లో చేరారు.
జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి షిర్డీహిల్స్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండ నరేందర్ ఆధ్వర్యంలో 50 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అదే విధంగా జగద్గిరిగుట్టకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు అమర్నాథ్ , ఎండి జహంగీర్ ఆధ్వర్యంలో 100 మంది, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ వేణుయాదవ్ ఆధ్వర్యంలో పలువురు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
చింతల్ డివిజన్ పరిధి వల్లభాయ్ పటేల్‌నగర్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి, నర్సింహా యాదవ్, సునీల్, ప్రసాద్, సిద్దు, జీలాని, రమేశ్, రాజు ఆధ్వర్యంలో 150 మంది వల్లభాయ్ పటేల్ నగర్ కాలనీ అధ్యక్షులు శేఖర్ రావు ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహ్మద్ రఫీ, మక్సూద్ అలీ, కె.పి.వెంకటేశ్ గౌడ్, బస్వరాజ్, కన్నెకంటి మల్లేశ్, ప్రభాకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డినగర్ డివిజన్ పరిధి వెంకట్రామిరెడ్డినగర్కు చెందిన ఇర్ఫాన్ ఖాన్ , అర్షద్, మస్తాన్, సోను ఆధ్వర్యంలో 150 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
సుభాష్‌నగర్ డివిజన్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ట్రస్టు చైర్మన్ బిజ్జిలి సాంబయ్య , నర్సింహ, శ్రీకాంత్ , శ్రీనివాస్, నూరాజ్, వాసు తన అనుచరులతో కలిసి ఆదివారం ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నవీన్ రాయ్, యేసు, బలరాంరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చింతల్ డివిజన్ పరిధి ఎన్‌ఎల్‌బీనగర్‌కు చెందిన జగదీశ్, వేణుమాదవ్, బాబ్లూ, చంటి, రామ్, రాఘవేంద్ర, సాయి, రమేశ్, యోగి, నర్సింహా తదితరులతో పాటు 50 మంది ఎన్ఎల్‌బీనగర్ యూత్ అధ్యక్షులు గిరిధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కె.పి.వెంకటేశ్‌గౌడ్, శేఖర్ రెడ్డి, ప్రకాశ్, ప్రభాకర్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.