హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన క్రతువు వైభవంగా కొనసాగుతున్నది. గతంలో ఎన్నడు లేనంతగా మహా గణపతిని చూసేందుకు భక్తులు(Devotees,) భారీగా తరలి వస్తున్నారు. దీంతో ట్యాంక్‌బండ్( Tankbund) పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మధ్యహం 1:30 గంటల వరకు నిమజ్జనం చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులు భారీగా తరలివస్తుండటంతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రజలు సహకరించాలని కోరారు.
కాగా, మంగళవారం ఉదయం 6.30 గంటలకు శోభాయాత్ర ప్రారంభమై మధ్యాహ్నం1.30 కల్లా ముగుస్తుం దన్నారు. మహాగణపతిని ట్రాయిలర్పై ఎక్కించేందుకు హైడ్రాలిక్ క్రూజ్ క్రేన్‌ను వినియోగిస్తున్నారు. 70 అడుగుల ఎత్తులో ఉన్న విగ్రహాన్ని తీసేందుకు ఈ క్రేన్‌కు ఉన్న 142 ఫీట్ల జాక్ ఉపయోగప డుతుందంటు న్నారు. అలాగే మహాగణపతి హుండీ ద్వారా రూ.75 లక్షల ఆదాయం సమకూరినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. హుండీ లెక్కింపులను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించారు.