సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ): వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూఐటీసీ) ఆధ్వర్యంలో దుబాయ్‌లో సదస్సును నిర్వహిస్తున్నామని డబ్ల్యూఐటీసీ చైర్మన్ సందీప్‌కుమార్ మక్తల తెలిపారు. మంగళవారం టీ హబ్‌లో దుబాయ్‌కి చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సందీప్‌కుమార్ మాట్లాడుతూ షార్జా ఎఫ్‌డీఐ ఆఫీసు నుంచి ఆహ్వానం అందడం గౌరవంగా భావిస్తున్నామని, దుబాయ్‌తో సత్సంబంధాలు, అవకాశాల కల్పన పట్ల ఆసక్తిగా ఉన్నామని పేర్కొన్నారు.
దుబాయ్‌లో 10మందితో కూడిన సభ్యుల బృందం వచ్చే నెలలో పర్యటించనుందన్నారు. సమావేశంలో షార్జా ఎఫ్‌డీఐ ఆఫీసుకు చెందిన సీఈఓ మహ్మద్ జులా అల్ ముషారక్, షార్జా రీసర్చ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పార్క్ సీఈఓ హుస్సేన్ అల్ మహ్మదీ, రీజినల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ మేనేజర్ ఫాతిమా ఫైజర్ ఆల్ షంషీ, డబ్ల్యూఐటీసీ సభ్యులు అశ్విన్ సీ.వీ.మర్రి శ్రీనివాస్, ఎంఎన్ఆర్ గుప్తా, సౌమ్య, అను, శివ గణేశ్ పాల్గొన్నారు.