జవహర్‌నగర్: సమగ్ర కులగణన సర్వే పత్రాలు తార్నాక రోడ్డుపై చిత్తు కాగితాలుగా పడ్డాయని, ప్రజల గోప్యతను అధికారులు రోడ్డు పడేశారంటూ..‘నమస్తే’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన మేడ్చల్ కలెక్టర్ ఆదేశాల మేరకు జవహర్‌నగర్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి శనివారం వివరణ ఇచ్చారు.
27వ డివిజన్ భక్తబాయికాలనీకి చెందిన సమగ్ర కులగణన పత్రాలను సూపర్ వైజర్ జ్యోతి ఇంటికి తీసుకెళ్లే క్రమంతో తార్నాక రోడ్డుపై పడిపోయినట్లు చెప్పారు. వాహనదారులు వీటిని వీడియోలు, ఫొటోలలో నిక్షిప్తం చేశారు. మిగతా పత్రాలు ఆఫీస్‌లో జాగ్రత్తగా భద్రపరిచినట్లు కమిషనర్ తెలిపారు. కాగా, కమిషనర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సూపర్వైజర్ జ్యోతిని సస్పెండ్ చేశారు.