
బాలానగర్, జనవరి 10 : ఫిరోజ్‌గూడలో చేపట్టిన ఫుట్ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. ఫుట్ఓవర్ బ్రిడ్జికి లిఫ్ట్ సదుపాయంతో పాటు మెట్లు కూడా ఏర్పాటు చేశారు. ఫతేనగర్-బాలానగర్ డివిజన్లను అనుసంధానం చేస్తూ ఫిరోజ్‌గూడలో నిర్మిస్తున్న ఫుట్ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. ఫతేనగర్ డివిజన్ పరిధి గౌతంనగర్ నుంచి బాలానగర్ డివిజన్ ఫిరోజ్‌గూడకు రోడ్డు దాటాలంటే మధ్యలో పటాన్చెరు టు సికింద్రాబాద్ ప్రధాన రహదారి ఉంది. ఈ రహదారి నుంచి జీడిమెట్ల టు సికింద్రాబాద్, పటాన్చెరు టు మేడ్చల్‌తో పాటు బాలానగర్ టు బోయిన్‌పల్లికి వెల్లే ప్రధాన రహదారి ఉండడం వలన ఇక్కడ వాహనాలు నిత్యం రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. దీంతో బాటసారులు రోడ్డు దాటేందుకు ఇబ్బందిగా ఉండేది. ఫుట్ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుతో ఈ సమస్యకు చెక్ పడినైట్లెంది.
2.5 కోట్ల నిధులతో పనులు..
గౌతంనగర్, ఫిరోజ్గూడలలో రూ. 2.5 కోట్ల నిధులతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జికి మెట్లతో పాటు లిఫ్ట్ సదుపాయం ఏర్పాటు చేయడం వలన సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
పనులు పూర్తయ్యాయి..
గౌతంనగర్, ఫిరోజ్‌గూడలో చేపట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మంత్రి ఎప్పుడు సమయం కేటాయిస్తే అప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.