ఉప్పల్, డిసెంబర్ 2 : వ్యాక్సినేషన్ ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని ఎల్బీనగర్ జోన్ జోనల్ కమిషనర్ పంకజ అన్నారు. ఉప్పల్ సర్కిల్ పరిధిలోని పలు వార్డుల్లో ఇంటింటి వ్యాక్సినేషన్ ప్రక్రియ, బస్తీ దవాఖానలను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మాట్లాడుతూ.. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ కోసం ఇంటింటి సర్వే కొనసాగించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అం దించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బస్తీ ద వాఖానలను పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానలను పరిశీలించి, పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీసీ అరుణకుమారి, ఈఈ నాగేందర్, డీపీఓ రమాదేవి, ప్రకాశ్ పాల్గొన్నారు.
థీమ్పార్కు, పెద్దచెరువు పరిశీలన..
ఉప్పల్ చౌరస్తాలోని థీమ్ పార్కును జడ్సీ పరిశీలించారు. ఈమేరకు పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రామంతాపూర్ పెద్దచెరువును సందర్శించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులను సత్వరం పూర్తిచేసి, సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీసీ అరుణకుమారి, ఈఈ నాగేందర్, డీఈ నాగమణి, ఏఈ కీర్తి తదితరులు పాల్గొన్నారు.