బంజారాహిల్స్,సెప్టెంబర్ 14: పనిచేస్తున్న ఇంట్లో గాజులు తస్కరించిన యువతిపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..ఫిలింనగర్ సమీపంలోని సినార్ వ్యాలీలో నివాసం ఉంటున్న రాధికాశర్మ నెలరోజుల క్రితం తన బెడ్రూమ్లోని కప్‌బోర్డులో 3తులాల బంగారు గాజులను భద్రపరిచింది. రెండ్రోజుల క్రితం ఫంక్షన్‌కు వెళ్లే క్రమంలో గాజుల కోసం చూడగా కనిపించలేదు.
దీంతో అన్ని ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోయింది. తన గదిలోకి పనిమనిషి జ్యోతి తప్ప మరెవరూ రాలేదని,ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూ రాధికాశర్మ ఆదివారం ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.