Theenmar Mallanna | రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉప్పల్ పోలీస్స్టేషన్లో రెడ్డి సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం ప్రతినిధులు రజితారెడ్డి, కల్పనరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, రెడ్డి సామాజిక వర్గంపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. – ఉప్పల్, జనవరి 29