శేరిలింగంపల్లి, మార్చి 20: ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు నిబంధనలు అలవాటుగా మార్చుకోవాలని సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ గజరావు భూపాల్ అన్నారు. గురువారం గచ్చిబౌలిలోని అరేటే హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వరల్డ్ హెడ్ ఇంజ్యూరీ డే అవగాహన దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వాహనదారులకు హెల్మెట్లు పంపణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారించడానికి హెల్మెట్ దరించడం చట్టపరమైన నిబంధన మాత్రమే కాకుండా, ప్రాణాలను కాపాడే మంచి అలవాటుగా మార్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అరేటే హాస్పిటల్స్ న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ రామకృష్ణ చౌదరి, సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ రవీశ్ సుంకర, మెడికల్ డైరెక్టర్, క్రిటికల్ కేర్ హెడ్ పవన్ కుమార్ పాల్గొన్నారు.