ఎంతో కాలంగా కలెక్టరు కార్యాలయానికి వెళ్లడానికి ఇ బ్బందులు పడుతున్న ప్రజలకు ఇక నుంచి అందుబాటులో ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇం ద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, రాజేంద్రనగర్, ఎల్బీనగర్ నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. గురువారం సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా కలెక్టరు కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభకు కందుకూరు నుంచి జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డితో పాటు మండల పార్టీ అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, మహిళ అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, ఆధ్వర్యంలో పార్టీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి పక్షాలకు చెందిన పార్టీల నాయకుల మాటలు ప్రజలు నమ్మకుండా కృషి చేయాలని కోరారు.
పట్నం నియోజక వర్గంలోని కొంగర కలాన్‌లో రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ నూతన భవన ప్రారంభోత్సవానికి మహేశ్వరం నియోజక వర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లారు. విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పిలుపు మేరకు టీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లడంతో దారులన్ని గులాబీ మయంగా మారాయి.