Double Bed Rooms | దుండిగల్, మే 20: పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలి అన్న ఉద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించి, పంపిణీ చేసిన డబుల్ బెడ్రూం ఇండ్లు కొందరికి కాసుల వర్షం కురిపిస్తుంది. అసోసియేషన్ల పేరుతో ఒక్కొక్క ఇంటి నుంచి వేలా ది రూపాయలు వసూలు చేస్తుండటంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. మెయింటెనెన్స్, మరమ్మతులు వంటి పనులు చెప్పి అసోసియేషన్ ప్రతినిధులు నెల నెలా వసూళ్లకు పాల్పడుతున్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం (సర్కిల్ )డివిజన్ పరిధి, కైసర్ నగర్లో యథేచ్ఛగా వసూళ్లు చేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు చెల్లించకపోతే కరెంట్ కట్ చే స్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోతున్నారు. 2 బీహెచ్ కే హౌసింగ్ ఫ్లాట్ ఓనర్స్ మెయింటెనెన్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరిట కొందరు వ్యక్తులు అసోసియేషన్ గా ఏర్పడి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్లు బాధితు లు ఆరోపిస్తున్నారు. అపార్ట్మెంట్ల రూపు టాప్ పై వాటర్ ప్రూపింగ్ పేరిట రూ.3 వేలు చెల్లించాలని హుకుం జారీ చేస్తున్నట్లు వాపోతున్నారు. ప్రతి ఒక్క లబ్ధిదారుడు నెల నెలా రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నారని పేర్కొంటున్నారు.