కంటోన్మెంట్ ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి సహకరించాలి.. బోర్డు సీఈవోతో మర్రి రాజశేఖర్ రెడ్డి
కంటోన్మెంట్ ప్రాంతంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని బోర్డు సీఈఓ మధుకర్నాయక్ను బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి కోరారు. గురువారం కంటోన్మెంట్‌లోని సీఈఓ చాంబర్లో మధుకర్నాయక్ను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డితో కలిసి మర్రి రాజశేఖర్‌రెడ్డి సమావేశమయ్యారు.
కంటోన్మెంట్, జూలై 6: కంటోన్మెంట్ ప్రాంతంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని బోర్డు సీఈఓ మధుకర్నాయక్ను బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి కోరారు. గురువారం కంటోన్మెంట్‌లోని సీఈఓ చాంబర్లో మధుకర్నాయక్ను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డితో కలిసి మర్రి రాజశేఖర్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లోని నాలాల ఆధునీకరణ, పాఠశాలలు, రోడ్ల మరమ్మతులతో పాటు పలు అంశాలను సీఈఓ దృష్టికి తీసుకువెళ్లారు.
వర్షాకాలం ప్రారంభం కావడంతో బోర్డు పరిధిలోని నాలాల్లో పూడికతీతతో పాటు పాఠశాలల ఆధునీకరణపై దృష్టి పెట్టాలన్నారు. గతంలో చర్చించిన సమస్యలు కొలిక్కి వచ్చాయని, ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో చిన్న కమేళా, సెంట్రల్ బ్యాటరీ, రసూల్‌పురా, బాలంరాయి, రిసాల బజార్ ప్రోగ్రెసివ్ కాలనీల్లోని సమస్యలను పరిష్కరించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు కావాలన్నా తప్పకుండా ఇస్తామని స్పష్టం చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఈఓ త్వరలోనే వార్డుల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు లోక్నాథం, నళినికిరణ్, నేతలు ముప్పిడి మధుకర్, ప్రవీణ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

