Hyderabad | సిటీబ్యూరో: ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే తక్కువకు పడిపోతుండటంతో గ్రేటర్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో ఉదయం ఉష్ణోగ్రతలు సైతం పడిపోతుండడంతో పగలు సమయంలో కూడా చలి వణికిస్తున్నది.
ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠం 2.2 తగ్గి 28.8 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2.3 తగ్గి 15.7 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 48 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నగర శివారు ప్రాంతాలైన పటాన్చెరులో రాత్రి ఉష్ణోగ్రతలు 12.4, రాజేంద్రనగర్‌లో 14, హకీంపేటలో 15.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు తెలిపారు.