Biryani | బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నం. 3లోని ఐసీఐసీఐ లాంబార్డ్ ఇన్సూరెన్స్ సంస్థకు చెందిన నితేశ్ రావుతో పాటు 12 మంది సిబ్బంది గురువారం రోడ్ నం. 3లోని బిర్యానీ వాలా రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు. వారికి సర్వ్ చేసిన బిర్యానీలో బొద్దింక కనిపించడంతో నితేశ్రావు తదితరులు హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లారు. ఏదో పొరపాటున బొద్దింక వచ్చింది.. అప్పుడుప్పుడు ఇలా వస్తుంటాయి.. లైట్ తీసుకోండి అంటూ హోటల్ సిబ్బంది చెప్పడంతో వాగ్వాదం చోటు చేసుకుంది.
హోటల్ నిర్వాహకులను పిలిపించండి ఇదేం పద్ధతి అని ప్రశ్నించినా ఏమాత్రం పట్టించుకోకపోగా న్యూసెన్స్ చేస్తున్నారంటూ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు ఇరు వర్గాలకు సర్దిచెప్పారు. ఈ వ్యవహారంపై బాధితులు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగానికి ఫిర్యాదు చేశారు.