సికింద్రాబాద్, మే 5: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే తన నివాసంలో నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారునికి రూ.2.5లక్షల విలువ గల సీఎం సహాయనిధి ఎల్వోసీ పత్రాన్ని అందించారు. న్యూ బోయిన్పల్లి ప్లాస్సీ లైన్‌కు చెందిన ఆయూష్కుమార్ సింగ్ కొంతకాలంగా అనారోగ్యం బారిన పడ్డారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే సాయన్నను సంప్రదించగా సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేయించారు.
దీంతో వైద్య ఖర్చులకు సంబంధించి రూ.2.5లక్షల ఎల్వోసీని సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరయింది. ఈ క్రమంలో లబ్ధిదారుడికి ఎల్వోసీని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే..మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించేందుకు సీఎం కృషి చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. కార్యక్రమంలో మురళీయాదవ్, పనస సంతోష్, సదానంద్‌గౌడ్, భాస్కర్ ముదిరాజ్ పాల్గొన్నారు.